సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

Published : 15 Apr 2024 03:21 IST

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆదివారం ఉదయం అయిదు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సల్మాన్‌ ఇంట్లో ఉన్నారో లేదో అన్న విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులు కానీ, అటు అధికార వర్గాలు కానీ వెల్లడించలేదు. ఘటన నేపథ్యంలో  సల్మాన్‌ ఇంటి వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దుండగులు వినియోగించినదిగా భావిస్తున్న ఓ మోటారు సైకిల్‌ను ఇంటికి కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని