Crime News: అత్యాశకు పోయి.. మోసగాళ్ల వలలో చిక్కి
త్వరగా రూ.లక్షలు సంపాదించాలన్న వ్యాపారుల అత్యాశ మోసగాళ్లకు వరమైంది. మాయగాళ్ల వలలో చిక్కుకొన్న వారు రూ.లక్షలు పోగొట్టుకొని తలలు బాదుకోవాల్సి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దముగట్ల అమర్నాథ్రెడ్డి, జక్కల ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు.
తక్కువ ధరకు బంగారం ఇస్తామని స్టూవర్టుపురం ముఠా దోపిడీ
రూ.31 లక్షలు పోగొట్టుకున్న షాద్‌నగర్ వ్యాపారులు
బాపట్ల, న్యూస్‌టుడే: త్వరగా రూ.లక్షలు సంపాదించాలన్న వ్యాపారుల అత్యాశ మోసగాళ్లకు వరమైంది. మాయగాళ్ల వలలో చిక్కుకొన్న వారు రూ.లక్షలు పోగొట్టుకొని తలలు బాదుకోవాల్సి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దముగట్ల అమర్నాథ్రెడ్డి, జక్కల ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. ప్రకాశం జిల్లా చీరాలలో రూ.31 లక్షలకే కిలో బంగారం లభిస్తుందని మధ్యవర్తులు వారిని నమ్మించారు. సమాచారం నిర్ధారించుకుందామని వినుకొండకు చెందిన మధ్యవర్తి ద్వారా వారు ఈ నెల 11న విజయవాడకు వచ్చారు. గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన ర్యాప్ ముఠా సభ్యులు తమ వెంట కొంత బంగారం తీసుకొచ్చి వారికి చూపించారు. అసలు బంగారమేనని నిర్ధారించుకుని కిలో కొనేందుకు ఈ నెల 15న శనివారం వ్యాపారులు మరో నలుగురు మిత్రులతో కలిసి నగదుతో చీరాలకు వచ్చారు. వారిని ర్యాప్ ముఠా బాపట్ల మండలం బేతపూడి వద్దకు పిలిపించి బంగారం ఇస్తున్నట్లు నటించి రూ.31 లక్షల నగదు తీసుకుంది. అదే సమయంలో ముఠా సభ్యులు కొందరు పోలీసుల వేషంలో వచ్చి హడావుడి చేసి నగదు తీసుకొని ఉడాయించారు. కాసేపటికి మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబోమంటూ వెదుళ్లపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్టూవర్టుపురానికి చెందిన నిందితులు ఉత్తమ్‌కుమార్, ప్రసాద్, దానియేలు, శశిధర్, గురవయ్య, వెంకట్రావు, డేవిడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు