జ్యుడిషియల్‌ కస్టడీకి డీకే శ్రీనివాస్‌

ప్రముఖులు, చిత్రపరిశ్రమకు చెందిన వారికి మాదక ద్రవ్యాలు అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త డి.కె.శ్రీనివాస్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గురువారం బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.

Published : 27 May 2022 06:10 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ప్రముఖులు, చిత్రపరిశ్రమకు చెందిన వారికి మాదక ద్రవ్యాలు అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త డి.కె.శ్రీనివాస్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గురువారం బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. శ్రీనివాస్‌ను 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన శ్రీనివాస్‌ను ఎన్‌సీబీ మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించింది. సదాశివనగరలోని ఆయన నివాసం నుంచి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. బుధవారం యలహంకలోని కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించాక.. అరెస్టు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని