ఇటలీలో కర్నూలు యువకుడి మృతి.. అలలు సముద్రంలోకి లాగేయటంతో ప్రమాదం

విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న తనయుడు త్వరలోనే స్వదేశానికి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న

Updated : 12 Jun 2022 08:01 IST

 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న తనయుడు త్వరలోనే స్వదేశానికి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్‌(24) అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివాక ఇటలీలోని మిలాన్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో ప్రవేశం పొందారు. 2019 సెప్టెంబరులో అక్కడికి వెళ్లారు. గతేడాది ఏప్రిల్‌లో ఇక్కడికి వచ్చి సెప్టెంబరులో తిరిగివెళ్లారు. ఇటీవల కోర్సు పూర్తయ్యాక త్వరలో ఉద్యోగం సాధించి కర్నూలుకు వస్తానని తల్లిదండ్రులకు చెప్పారు. పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం అక్కడి మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ఒడ్డు వరకు వచ్చిన అలలు ఆయన్ని లాక్కెళ్లాయి. రక్షించడానికి కోస్ట్‌ గార్డులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృతదేహమే కనిపించింది. భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని