Andhra News: వంశధార ఈఈపై వైకాపా నాయకుల దాడి!

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు టెక్కలి కార్యనిర్వాహక ఇంజినీరు సీహెచ్‌ శ్రీకాంత్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. శనివారం జరిగిన

Updated : 04 Sep 2022 07:00 IST

సాగునీటి విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణ

టెక్కలి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు టెక్కలి కార్యనిర్వాహక ఇంజినీరు సీహెచ్‌ శ్రీకాంత్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. శనివారం జరిగిన ఈ ఘటనతో కార్యాలయ వర్గాలు భయభ్రాంతులకు గురయ్యాయి. ఘటనపై ఈఈ తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండల ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, పీఏసీఎస్‌ ఛైర్మన్లు సర్లాన భైరాగి, కురమాన బాలకృష్ణ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైకాపా నాయకులు కార్యాలయానికి వచ్చారు. మండలంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఈఈని డిమాండు చేశారు. మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపా నేతలు తనను నెట్టేసి దాడి చేశారని, అడ్డుకున్న కార్యాలయ సహాయకుణ్ని కొట్టారని ఈఈ ఆరోపించారు. సాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. తనను దూషిస్తేనో, నిందిస్తేనో సమస్య పరిష్కారం కాదని చెప్పినా వినకుండా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. నందిగాం ఎంపీపీ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. దాడిలాంటిదేమీ జరగలేదని, నీరు అందని రైతుల ఆవేదననే ప్రజాప్రతినిధులుగా వివరించామని తెలిపారు. గతేడాది వరకు సాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తలేదని, ఇప్పుడే ఇలా జరుగుతుండటంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని