రుణయాప్‌ వేధింపులతో.. యువకుడి ఆత్మహత్య

రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులకు తాళలేక మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ధవళేశ్వరం సీఐ కె.మంగాదేవి కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన కొరశిఖ శ్రీనివాసరావు(25) ధవళేశ్వరం పరిధిలోని విద్యుత్తు ఉపకేంద్రంలో షిఫ్ట్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నారు.

Published : 02 Oct 2022 04:29 IST

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులకు తాళలేక మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ధవళేశ్వరం సీఐ కె.మంగాదేవి కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన కొరశిఖ శ్రీనివాసరావు(25) ధవళేశ్వరం పరిధిలోని విద్యుత్తు ఉపకేంద్రంలో షిఫ్ట్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నారు. బడ్డీ క్యాష్‌ రుణయాప్‌ ద్వారా రుణం తీసుకొని తిరిగి చెల్లించారు. అయినప్పటికీ యాప్‌ నిర్వాహకులు ఇంకా డబ్బు కట్టాలని, లేదంటే సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేస్తామని బెదిరించారు. మీ బంధువుల ఫోన్‌నంబర్లకు అసభ్య సందేశాలు పంపుతామని హెచ్చరించారు. వారి వేధింపులు పెరగడంతో శనివారం మధ్యాహ్నం పనిచేసే కార్యాలయంలోనే శ్రీనివాసరావు ఉరేసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని