కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

నకిలీ విత్తనాల కారణంగా పది ఎకరాల్లో సాగు చేసిన వరి పూర్తిగా నష్టపోయినట్లు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం తీగలవేణి శివారు పాటిమీది తండాకు చెందిన రమేశ్‌ దంపతులు వెల్లడించారు.

Updated : 05 Oct 2022 06:31 IST

నకిలీ వరి విత్తనాలు విక్రయించారని ఆరోపణ

కేసముద్రం, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాల కారణంగా పది ఎకరాల్లో సాగు చేసిన వరి పూర్తిగా నష్టపోయినట్లు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం తీగలవేణి శివారు పాటిమీది తండాకు చెందిన రమేశ్‌ దంపతులు వెల్లడించారు. వీరు మంగళవారం కేసముద్రంలో విత్తనాలు విక్రయించిన ఎరువుల దుకాణం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. పురుగుల మందు తాగేందుకు రమేశ్‌ ప్రయత్నించగా పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు. 1001 రకం విత్తనాలు అడిగితే దుకాణదారు మరో రకం అంటగట్టినట్లు రైతు ఆరోపించారు. ప్రస్తుతం వరి కంకిపోసే దశలో ఉండగా గింజ తాలుగా మారిందన్నారు. సుమారు రూ.2 లక్షలు నష్టపోయినట్లు కన్నీరు పెట్టుకున్నారు. వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో దుకాణం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎస్సై తిరుపతి.. రైతు దంపతులకు సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని