సిద్ధూ మూసేవాలా హత్య కేసు.. సూత్రధారి గోల్డీబ్రార్‌ అమెరికాలో అరెస్టు

సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

Updated : 03 Dec 2022 06:26 IST

అహ్మదాబాద్‌: సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ శుక్రవారం తెలిపారు. త్వరలోనే గోల్డీ బ్రార్‌ను భారత్‌కు రప్పిస్తామని పేర్కొన్నారు ‘‘కాలిఫోర్నియా పోలీసులు బ్రార్‌ను అరెస్టు చేశారు. వారు భారత్‌ ప్రభుత్వాన్ని, పంజాబ్‌ పోలీసులను సంప్రదించారు’’ అని సీఎం చెప్పారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సతీందర్‌జీత్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ 2017 నుంచి కెనడాలో ఉంటున్నాడు. ఇటీవల అమెరికాకు మకాం మార్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని