Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!

భార్యపై అనుమానంతో ఆమెను చంపేసి పొలంలో పూడ్చి పెట్టాడో భర్త. ఆ తర్వాత తన భార్య కనిపించడంలేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.

Updated : 04 Feb 2023 05:13 IST

లఖ్‌నవూ: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి.. సమాధిపై మొక్కలు పెంచిన ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌ (Ghaziabad)లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన దినేశ్‌ కూరగాయల వ్యాపారి (Vegetable Vendor). అతని భార్యతో కలిసి ఘజియాబాద్‌లో ఉంటున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం (Extra marital Affair) ఉందన్న అనుమానంతో దినేశ్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో జనవరి 25న భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన దినేశ్‌ భార్యను గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఒకరోజు భార్య శవాన్ని తనతోపాటు ఇంట్లోనే ఉంచాడు. 

మరుసటి రోజు ఎవరికీ అనుమానం రాకుండా దినేశ్‌ తన భార్య శవాన్ని తీసుకెళ్లి వ్యవసాయ భూమిలో పాతి పెట్టాడు. మృతదేహం త్వరగా కుళ్లిపోవడం కోసం సమాధిలో 30 కేజీల ఉప్పును పోశాడు. తర్వాత మొక్కల కోసం గుంత తవ్వినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు సమాధిపై కొన్ని మొక్కలు నాటాడు. మరో రెండు రోజుల తర్వాత భార్య కనిపించడంలేదని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కంప్లెంట్‌గా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు దినేశ్‌పై అనుమానం కలిగింది. దీంతో అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దినేశ్‌ వ్యవసాయ భూమి నుంచి అతని భార్య శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు