హాథ్రస్‌ బాధితురాలి తండ్రి, సోదరులకు సమన్లు

యూపీలోని హాథ్రస్‌లో గ్యాంగ్‌రేప్‌, హత్యకు గురైన దళిత యువతి తండ్రి, సోదరులకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం వారిని విచారించిన దర్యాప్తు సంస్థ.. బుధవారం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలి.....

Published : 15 Oct 2020 00:43 IST

లఖ్‌నవూ: యూపీలోని హాథ్రస్‌లో గ్యాంగ్‌రేప్‌, హత్యకు గురైన దళిత యువతి తండ్రి, సోదరులకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం వారిని విచారించిన దర్యాప్తు సంస్థ.. బుధవారం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకుంటున్న సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అంజలి గాంగ్వర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. యువతి కుటుంబ సభ్యుల్లోని మగవారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీబీఐ కార్యాలయంలో రెండో రోజు విచారిస్తున్నట్లు తెలిపారు. ‘కుటుంబంలోని మగవారు ఈరోజు కూడా విచారణకు హాజరుకానున్నారు. ఆడవారిని ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణలో అధికారులు వారిని ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయబోరని భావిస్తున్నాం’ అని గాంగ్వర్‌ వెల్లడించారు.

హాథ్రస్‌లోని వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయాన్ని సీబీఐ తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. అధికారులు అందులోనే విచారణ జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఫోరెన్సిక్‌ బృందంతోపాటు ఘటనా ప్రాంతానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. పలు నమూనాలు సేకరించారు. యువతిని దహనం చేసిన ప్రాంతంలోనూ నమూనాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని