Crime News: గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌.. ముగ్గురి అరెస్టు

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల దిగుమతుల మీద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు.

Updated : 23 Dec 2021 15:12 IST

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల దిగుమతుల మీద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. ఇందులో భాగంగా ఇవాళ డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్‌టాసీ మాత్రలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.26లక్షల 28వేలు ఉంటుందన్నారు. మాదకద్రవ్యాలు తరలిస్తున్న వారిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు.

ప్రధాన నిందితుడు జావూద్‌ అలియాస్‌ జూడ్‌ గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తెచ్చాడని.. అతను పరారీలో ఉన్నట్లు సీపీ చెప్పారు. నగరంలోని టోలిచౌకికి చెందిన మహమ్మద్ అష్రఫ్ వద్ద 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజాంపేట్‌కి చెందిన రామేశ్వర శ్రవణ్ కుమార్ నుంచి గ్రాము, ప్రకాశం జిల్లాకు చెందిన చరణ్ తేజ వద్ద నుంచి ఒక గ్రాము కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది సైబరాబాద్‌ పరిధిలో 202 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 419మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని