సినీఫక్కీలో ఎస్‌బీఐకి కన్నం..!

సినీ ఫక్కీలో దొంగలు ఓ బ్యాంకుకు కన్నమేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. వివరాల్లో వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు

Published : 26 Mar 2021 01:13 IST

పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో భారీ చోరీ

మంథని గ్రామీణం: సినీ ఫక్కీలో దొంగలు ఓ బ్యాంకుకు కన్నమేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. దొంగలు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సైతం బయటపడకుండా సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్‌ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిందితుల కోసం 8 బృందాలు..

వేలిముద్రలు సైతం దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు చెప్పారు. నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్‌, ఏసీపీలు ఉదయకుమార్‌ రెడ్డి, ఉమేందర్‌, సీఐలు మహేందర్‌, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని