ACB Telangana: ఏసీబీ వల... పలువురు అధికారుల అరెస్టు

అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Published : 15 Apr 2024 16:07 IST

హైదరాబాద్‌: అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని వివిధ చోట్ల తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌ ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖా పరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రూ. 20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఎల్కతుర్తి హోటల్‌లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. రంగంలోకి దిగిన ఏసీబీ ఆయన్ని అరెస్టు చేసింది. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని