Andhra News: బాణసంచా గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని బాణసంచా గిడ్డంగిలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగంది.

Updated : 31 May 2023 20:38 IST

తిరుపతి: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని బాణసంచా గిడ్డంగిలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కువ్వాకుల్లికి చెందిన ముగ్గురు కార్మికులు సాధు నాగేంద్ర (26), శంకరయ్య (36), గూడుకు చెందిన ఏడుకొండలు (45) సజీవ దహనమయ్యారు. గిడ్డంగి యజమాని వీరరాఘవులు, కల్యాణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.

బాణసంచా పేలుతుండటంతో గిడ్డంగి నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సత్యవేడు సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై పురుషోత్తం రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మందు తయారీ సమయంలో ప్రమాదం జరిగిందా? వేరే ఏమైనా కారణాలున్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని