‘70 మంది యువతులను బ్లాక్‌మెయిల్‌ చేశాడు’

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రొఫైల్‌ ఫొటోతో నకిలీ ఖాతా తెరిచి చాటింగ్‌లో పరిచయమైన వారిని బెదిరిస్తున్న సుమంత్‌ అనే యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

Published : 04 Feb 2021 01:47 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలతో యువకుడి మోసం

హైదరాబాద్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రొఫైల్‌ ఫొటోతో నకిలీ ఖాతా తెరిచి చాటింగ్‌లో పరిచయమైన వారిని బెదిరిస్తున్న సుమంత్‌ అనే యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 70 మంది యువతులను సుమంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు గుర్తించారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

విజయవాడకు చెందిన సుమంత్.. నగరంలోని మణికొండలో నివాసముంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి కాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి అవతారమెత్తుతాడు. అందమైన ఫొటోలు పెట్టి నకిలీ ఖాతాలు తెరుస్తాడు. యువతిలాగే భావించి అవతలి వాళ్లు స్పందిస్తే అసభ్యకరమైన చిత్రాలు పంపిస్తాడు. ఈ క్రమంలోనే ఎదుటివారి ఫొటోలు కూడా సేకరిస్తాడు. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతాడు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. సుమంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇవీ చదవండి..

మానసిక వైద్యశాలకు మదనపల్లె నిందితులు

తమ్ముళ్లను చంపిన అన్నలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని