logo

‘కలెక్టరేట్‌ ముట్టడి’కి పోలీసు ఆంక్షలు

గురువారం తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్‌లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.

Published : 20 Jan 2022 04:27 IST


గురజాలలో ఉపాధ్యాయ సంఘ నేతకు నోటీసు అందజేస్తున్న పోలీసు సిబ్బంది

గురజాల, న్యూస్‌టుడే: గురువారం తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్‌లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. చలో కలెక్టరేట్‌ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా మిమ్మల్ని ఇంట్లోనే ఉండాల్సిందిగా తెలియజేయడమైనదని, పోలీసు వారికి సహకరించగలరని    కోరారు. నోటీసు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని అందులో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు, పలువురు ఉపాధ్యాయులకు నోటీసులు అందజేశారు. 


అందజేసిన నోటీసు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని