logo

పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

మే 23 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి భారతిహోళ్లికేరి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని

Published : 22 May 2022 03:37 IST

ఆర్‌బీ హెచ్‌వీ పాఠశాలలో ఇన్‌ఛార్జి డీసీపీతో కలిసి ఏర్పాట్లను

పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరి

ఏసీసీ, న్యూస్‌టుడే: మే 23 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి భారతిహోళ్లికేరి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌బీహెచ్‌వీ, శ్రీచైతన్య పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఇన్‌ఛార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి పరిశీలించారు. పాఠశాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఏర్పాట్లపై చర్చించారు. ఎండల నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. గంట ముందుగానే ఆయా కేంద్రాల్లో ఉండేలా విద్యార్థులు ప్రణాళికలు చేసుకోవాలని, పరీక్ష సమయానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులను ఆయా రూట్లలో నడిపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని