logo

రూ.14.34 లక్షల విలువైన గుట్కా పట్టివేత

నిషేధిత గుట్కా జోరుకు కళ్లెం వేసేందుకు పోలీసులు ఓ వైపు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నా.. అందుకు వ్యాపారులు ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. జిల్లాలో గుట్కా వ్యాపారం చాపకింద నీరులా సాగుతుండగా..

Published : 23 May 2022 02:48 IST

బోథ్, న్యూస్‌టుడే : నిషేధిత గుట్కా జోరుకు కళ్లెం వేసేందుకు పోలీసులు ఓ వైపు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నా.. అందుకు వ్యాపారులు ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. జిల్లాలో గుట్కా వ్యాపారం చాపకింద నీరులా సాగుతుండగా.. ఆదివారం రూ.లక్షల విలువైన గుట్కాను బోథ్‌ మండలంలో పట్టుకోవడం అందుకు నిదర్శనం. సంబంధిత వివరాలను బోథ్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. పొచ్చర సమీపంలో సీఐ నైలు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని గమనించారు. దానిని ఆపే క్రమంలో సంబంధిత వాహన చోదకుడు పోలీసులను తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించి కన్గుట్ట సమీపంలో పట్టుకున్నారు. అందులో పరిశీలించగా గుట్కా పొట్లాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్‌కు చెందిన చోదకుడు షబ్బీర్‌ను విచారించగా కర్ణాటకలోని బీదర్‌ నుంచి గుట్కాను ఆదిలాబాద్‌లోని అస్లాం ట్రేడర్స్‌కు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నాడు. దాదాపు రూ.14.34 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అస్లాం ట్రేడర్స్‌ దుకాణ యజమానిపై 30 కేసుల వరకు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ, ఎస్సై రవీందర్, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని