logo

నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని  ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం రాత్రి మెస్రం వంశస్థుల మహా పూజలతో ప్రారంభం కానుంది.

Published : 21 Jan 2023 05:42 IST

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని  ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం రాత్రి మెస్రం వంశస్థుల మహా పూజలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి నూతన ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మహాపూజ రోజున మెస్రం వంశం మహిళలు మట్టి కుండలలో మర్రి చెట్ల వద్ద కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం నాగోబా దేవత పూజారి(కటోడా) ప్రధాన్‌లతో పాటు మరో అయిదుగురు పెద్దలు నాగోబా గర్భగుడిలో గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత మహాపూజలుత నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చు..

ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ నుంచి నాగోబా జాతరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నిర్మల్‌, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు గుడిహత్నూరు నుంచి నేరుగా నాగోబా జాతరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు.  

* ఆదిలాబాద్‌ నుంచి వాహనాలలో వచ్చే వారు ముత్నూరు గ్రామం నుంచి కేస్లాపూర్‌ చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం నుంచి కేస్లాపూర్‌ 44 కి.మీ దూరంలో ఉంది.

*  మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి జాతరకు వచ్చే భక్తులు ఉట్నూరు మీదుగా ముత్నూరు గ్రామానికి చేరుకోవాలి. ముత్నూరు నుంచి నాగోబా ఆలయం 4 కి.మీ దూరంలో ఉంది.

*  నిర్మల్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు ఇచ్చోడ మండలానికి చేరుకుని, ఇచ్చోడ నుంచి సిరికొండ మండలానికి చేరుకుంటే అక్కడి నుంచి 9 కి.మీ ప్రయాణించి కేస్లాపూర్‌ చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని