logo

ప్రయోజనం బాగున్నా..అనుసంధానం అంతంతే !

ఆరోగ్యశ్రీ.. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-రోగ్యశ్రీ(ఏబీపీఎంజేఏవై)గా మారిన సంగతి తెలిసిందే.

Published : 31 Mar 2023 06:08 IST

నిర్మల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ-కేవైసీ చేస్తున్న ఆరోగ్య మిత్రలు

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: ఆరోగ్యశ్రీ.. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-రోగ్యశ్రీ(ఏబీపీఎంజేఏవై)గా మారిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఈ కార్డు సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో సంబంధిత సేవలున్న ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశాన్నిచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డు(ఆహార భద్రత కార్డు) ఉన్న వారికి గతంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.2 లక్షల వరకే వైద్యం పొందే వీలుండగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.3 లక్షలు లాభం చేకూరడంతోపాటు దేశ వ్యాప్తంగా సేవలు పొందవచ్చు. లబ్ధిదారులు చేయాల్సిందల్లా ఆయా పథకానికి అనుసంధానం చేసుకోవడమే. లబ్ధిదారులు ఆయా సేవలందించే ఆసుపత్రుల్లోని ఆరోగ్య మిత్రలతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన గ్రామాలు, పట్టణాల్లోని ఏజెన్సీలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. కాగా ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుండగా.. స్పందన అంతంత మాత్రమే వస్తున్నట్లు సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు. తెల్లరేషన్‌ కార్డులు భారీగానే ఉన్నా నమోదు మాత్రం తక్కువగా ఉంటోందని ఆయా కార్యక్రమ అధికారులు పేర్కొంటున్నారు. గడువు నేటితో పూర్తి అవుతుండటంతో.. అందరూ నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
* గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎంతమంది అనుసంధానం చేసుకున్నారనేది అధికారికంగా తెలియకపోయినా.. ప్రస్తుత లబ్ధిదారుల్లో కనీసం 40శాతం కూడా పూర్తికాలేదని సమాచారం.

ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత కార్డు ఉన్నవారు, అందులోని లబ్ధిదారులందరూ అనుసంధానం చేసుకునే సమయంలో తప్పనిసరిగా కేం కార్డులో పేర్లున్నవారందరూ నమోదు చేసుకోవాల్సిందే..ద్రానికి వెళ్లాలి.
కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఆరోగ్యమిత్రలు, ఏజెన్సీల నిర్వాహకులు ప్రతి ఒక్కరి ఫొటోతో పాటు వివరాలు నమోదు చేసుకుంటారు. పూర్తి చేసిన తర్వాత చరవాణికి సందేశం వస్తుంది. ఆ తర్వాత కొన్నిరోజుల్లో నూతన కార్డును అదే కేంద్రానికి వెళ్లి పొందవచ్చు. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు కావడంతోపాటు రూ.5 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు.


ప్రక్రియ ఉచితమే
- రాపల్లి సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా మేనేజర్‌

ఏబీపీఎంజేఏవై ఈ-కేవైసీకి అధికారికంగా ఒక్క రోజే గడువు ఉండగా అనుసంధానం చాలా తక్కువగా ఉండటంతో పెంచే అవకాశం కనిపిస్తోంది. లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకం అర్హతకు నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఏ చోట కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే చరవాణి నం.83338 15932ని సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని