logo

ఖాళీ బిందెలతో మూడు కిలోమీటర్లు నడిచి నిరసన

మండలంలోని భీంపూర్‌ పంచాయతీ కొలాం బొజ్జుగూడ గ్రామ ఆదిమ గిరిజనులు సోమవారం మంచినీరు రావడం లేదని నిరసన తెలిపారు.

Published : 16 Apr 2024 02:39 IST

నార్నూర్‌ ఎంపీడీవో కార్యాలయానికి ఖాళీ బిందెలతో కాలినడకన వస్తున్న కొలాం ఆదివాసీలు

నార్నూర్‌, న్యూస్‌టుడే : మండలంలోని భీంపూర్‌ పంచాయతీ కొలాం బొజ్జుగూడ గ్రామ ఆదిమ గిరిజనులు సోమవారం మంచినీరు రావడం లేదని నిరసన తెలిపారు. కొలాంగూడ నుంచి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఖాళీ బిందెలతో 3 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఆ గ్రామపెద్ద సిడాం భీంరావు పటేల్‌ మాట్లాడుతూ 45 రోజులుగా మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసం రూ.5 లక్షలు మంజూరు చేసినా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంతో నీటి వెతలు తప్పడం లేదన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆదివాసీలకు బదులిస్తూ.. మీ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిడాం లచ్చు పటేల్‌, కొడప భీంబాయి, కొడప సోనేరావు, అయ్యుబాయి, అనుబాయి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని