logo

తరుణీ శరణం..!

పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.

Published : 07 May 2024 03:46 IST

మహిళా సంఘాల మద్దతుకు నేతల ప్రయత్నాలు

మండల సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం

చెన్నూరు పట్టణం, న్యూస్‌టుడే: పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా పొదుపు చేయడం.. రుణాలు స్వీకరించడం.. వాయిదాలు చెల్లించడం నెలనెలా సమావేశాలు నిర్వహించడం నిరంతరం చేస్తుంటారు. ఇంతవరకే వీరి పాత్ర పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లోనూ వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకుంటే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పార్టీల నేతలు భావిస్తుంటారు. అందుకే ఆ దిశగా పావులు కదుపుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వీరివైపు చూస్తున్నాయి.. తరుణుల కరుణ కోసం నేతలు రహస్య మంతనాలు మొదలుపెట్టారు. సంఘాల ప్రతినిధులతో మాటమంతీ చేస్తున్నారు. కరుణించాలని వేడుకుంటున్నారు..

మీ మద్దతు కావాలని..

గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో  సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ఇలా ఒక్కో మండలంలో సుమారు 5వేల నుంచి 10వేల మంది సభ్యులు ఉన్నారు. పురపాలికల్లో కూడా అదే స్థాయిలో ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టిసారించారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా వ్యూహాలను పన్నుతున్నారు. సంఘాల్లో కీలకంగా వ్యవహరించే వారి సహకారంతో సభ్యుల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓట్లను పొందేందుకు అన్నింటికీ సిద్ధపడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉన్న నాయకులను రంగంలోకి దింపుతున్నారు. విజయం సాధిస్తే సంఘాల అభివృద్ధికి కృషిచేస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు.. సంఘాల సభ్యులను ఒప్పిస్తే ఆ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ తమకే వస్తాయని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది నియోజకవర్గాలు పెద్దపల్లి, ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 23,01,424 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 11,72,832 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,878 గ్రామైక్య సంఘాలు, 67,644 స్వయం సహాయ సంఘాలు, 7,20,115 మంది సభ్యులు కొనసాగుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని