logo

ఓటు వేయం.. ఎన్నికలు బహిష్కరిస్తాం

తమ గ్రామానికి రహదారి, కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెనకు చెందిన గ్రామస్థులు పేర్కొన్నారు.

Published : 07 May 2024 03:53 IST

కలెక్టరేట్‌ వద్ద గోవెన గ్రామస్థులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : తమ గ్రామానికి రహదారి, కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెనకు చెందిన గ్రామస్థులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ వచ్చి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే వద్ద మొర వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో అయిదు గూడేలు ఉన్నాయని వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రోడ్డు లేదని, తాగునీటి సమస్య ఉందని, విద్యుత్తు లేదని వాపోయారు. ఎన్నికల సమయంలో పార్టీల ప్రతినిధులు వచ్చి హామీలు ఇస్తున్నా అమలు కావడం లేదని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో తమ గ్రామంలోని పోలింగ్‌ బూత్‌కు ఎన్నికల అధికారులను పంపించవద్దని, తాము ఓటు వేయమని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్‌ సమస్యలు పరిష్కరిస్తామని, ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలని సూచించినట్లు గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని