logo

ఫోన్‌ చేయండి.. కథలు వినండి!

కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు.

Updated : 10 May 2024 06:25 IST

ఫోన్‌ నంబరును ఆవిష్కరిస్తున్న ఎంఈవో వెంకటేశ్వరస్వామి, తదితరులు

రెబ్బెన, న్యూస్‌టుడే: కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. గురువారం జక్కులపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫోన్‌ చేయడం ద్వారా కథలు వినే ఫోన్‌ నంబరును ఆవిష్కరించారు. ఎంఈవో మాట్లాడుతూ రూమ్‌ టు రీడ్‌ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన 040-45209722 నంబర్‌కు ఫోన్‌ చేసి రోజూ ఒక కొత్త కథను పిల్లలు, తల్లిదండ్రులు వినవచ్చని చెప్పారు. లిటరసీ క్లౌడ్‌ వెబ్‌సైట్‌ ద్వారా పిల్లలు తమకు నచ్చిన భాషలో కథలన్నీ ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునే సౌకర్యం ఉందన్నారు. కథల పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే లాభాలను పిల్లలకు ఈ సందర్భంగా వివరించారు. వీటితో ఆలోచనశక్తి, ఊహ, రచన ఆసక్తి పెరుగుతుందన్నారు. కొత్తకొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఉందని, కథలు వింటూ, చదువుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీ ఎం.రాజేష్‌, ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్‌ ఎం.రవి, రూమ్‌ టూ రీడ్‌ సభ్యుడు శ్రీనివాస్‌, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు