logo

గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని

‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను.

Updated : 10 May 2024 07:00 IST

జన్నారం, న్యూస్‌టుడే : ‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. మా అమ్మతో కలిసి ఇదే గ్రామంలో నేనూ కూలీ పనులు చేశాను’ అంటూ ఒక్కసారిగా ఆత్రం సుగుణ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడున్న కూలీలు సైతం కన్నీరు పెట్టుకున్నారు. మేమంతా నిన్ను గెలిపిస్తామని ఆడబిడ్డ కన్నీరు పెట్టుకోవడం మంచిది కాదంటూ ఉపాధి కూలీ మహిళలంతా ఓదార్చారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఆత్రం సుగుణ స్వగ్రామం తిమ్మాపూర్‌లో గురువారం ప్రచారంలో చోటు చేసుకున్న దృశ్యమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని