logo

‘గ్లోబల్‌ ఎయిడ్‌’ వ్యవస్థాపకురాలు సాయిపద్మ కన్నుమూత

గ్లోబల్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సాయిపద్మ (52) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. సాయిపద్మ తండ్రి బీఎస్సాఆర్‌ మూర్తి గజపతినగరానికి చెందిన ప్రముఖ వైద్యులు.

Published : 16 Apr 2024 02:05 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: గ్లోబల్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సాయిపద్మ (52) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. సాయిపద్మ తండ్రి బీఎస్సాఆర్‌ మూర్తి గజపతినగరానికి చెందిన ప్రముఖ వైద్యులు. యుక్త వయసులో జరిగిన ప్రమాదంలో ఆమె దివ్యాంగురాలయ్యారు. దీంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ‘గ్లోబల్‌ ఎయిడ్‌’ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రత్యేక సమాచార కేంద్రాన్ని సైతం ఏర్పాటుచేశారు. న్యాయవాదిగా, రచయితగా, గాయనిగా, పారా రైఫిల్‌ షూటర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని