logo

వైకాపా పాలనలో మహిళలపై పెరిగిన అకృత్యాలు

వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్‌ కాంపెయినర్‌ నర్సిరెడ్డి తెలిపారు.

Published : 01 May 2024 01:44 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్‌ కాంపెయినర్‌ నర్సిరెడ్డి తెలిపారు. అనకాపల్లిలోని పూడిమడక రోడ్డులోని మంగళవారం రాత్రి మహిళా శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి వాటిని విస్మరించి మహిళలకు అన్యాయం చేసారన్నారు. మద్యపాన నిషేధం అని ప్రభుత్వంతో మద్యం అమ్మించారన్నారు. 

తెదేపా హయాంలో చంద్రబాబుయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారని, వాటిని తొలగించి నవరత్నాల పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేశారన్నారు. అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను గెలిపించాలని కోరారు. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కూటమి  ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇక్కడికి వచ్చిన మహిళా జనసంద్రం చూస్తుంటే జగన్‌మోహన్‌రెడ్డి పట్ల మహిళల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో మహిళలంతా ఎప్పడు ఎన్నికలు వస్తాయా! ఎప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించుదామా? అని ఎదురు చూస్తున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని