logo

మండుతున్న ఎండలు... తాగునీటికి అవస్థలు

వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

Published : 01 May 2024 01:59 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అరకులోయ నియోజకవర్గంలోని 630 గ్రామాల్లో కనీస నీటి వసతులు లేక ప్రజలు కలుషిత ఊట గెడ్డలు, పొలాల చెంతన ఉన్న కుండీల్లో నీటిపై ఆధారపడుతున్నారు

ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం, వనుగమ్మ, బుంగాపుట్టు, దారెల, పెదగుడ, కుమడ, బూసీపుట్టు పంచాయతీల్లోని గ్రామాలకు నీటి పథకాలు మంజూరైనా నిర్మాణాలు పూర్తి చేయలేదు. బూసీపుట్టు పంచాయతీలోని సంతవీధి, సరియాపల్లి, సుల్తాన్‌పుట్టు, ఖమ్మరిగొయ్యి గ్రామాల్లో ప్రజలు కలుషిత ఊటనీరు వినియోగిస్తున్నారు. మైళ్ల దూరం వెళ్లి పొలాల నుంచి ఊటనీరు తీసుకొస్తున్నారు. బాబుసాల, కుమడ, బరడ, లక్ష్మీపురం, రంగబయలు, బుంగాపుట్టు పంచాయతీల్లోని గిరిజనులకు గెడ్డల నీరే దిక్కవుతోంది.

మత్స్యగెడ్డ పరివాహకంలో ఉన్న పెదగుడ, పనసపుట్టు, దారెల, ఏనుగురాయి, సుజనకోట పంచాయతీల్లోని గ్రామాల్లోనూ నీటి ఎద్దడి ఏర్పడి గిరిజనులు గెడ్డ ఒడ్డున బురదనీరు వినియోగిస్తున్నారు. ఈ నీటి వినియోగం వల్ల వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. రక్షిత మంచినీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని