logo

అల్లూరి స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు

రిటిష్‌ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది.

Published : 07 May 2024 06:58 IST

స్మారక ప్రదేశాలపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
నేడు విప్లవవీరుడి వర్ధంతి
కొయ్యూరు, న్యూస్‌టుడే

అల్లూరి పట్టుబడిన ప్రదేశంలో నిర్మించిన స్మారక స్తూపం

బ్రిటిష్‌ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది. నేటి వైకాపా ప్రభుత్వం విప్లవ వీరుడి ఆశయాలకు తూట్లు పొడుస్తూ, ఆయన స్మారకాలను నిర్లక్ష్యం చేసింది. గిరిజనానికి అడుగడుగునా అన్యాయం చేసింది. మంగళవారం అల్లూరి వర్ధంతి సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

అల్లూరి నడయాడిన స్థలాలను సందర్శక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్తు తరాలకు ఆయన గొప్పతనం తెలిసేలా అభివృద్ధి చేస్తామని వైకాపా పాలకులు హామీలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర వచ్చి కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెంలోని స్మారక ఉద్యానాల అభివృద్ధికి చర్యలు తీసుకొంటామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. 2022 మే 7న మంపలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్రపాలెంలో అల్లూరి అనుచరులైన గాం గంటన్నదొర, మల్లుదొర, పండుపడాల్‌ విగ్రహాలను రాజన్నదొర ఆవిష్కరించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. మంప, రాజేంద్రపాలెం స్మారక ఉద్యానాల్లో ఉపాధి హామీ పథకంలో పర్యటకులు నడిచేందుకు సిమెంట్‌ రోడ్లు, పూల మొక్కలు, కూర్చొనేందుకు సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై తీసుకున్న చర్యలు శూన్యం. అల్లూరి స్థావరంగా ఏర్పాటు చేసుకున్న మంప సమీపంలోని ఉర్లకొండ గుహ అభివృద్ధి జాడేలేదు. మంపలో ఉద్యానాన్ని క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. రాజేంద్రపాలెం ఉద్యానం కళాహీనంగా దర్శనమిస్తోంది.

గతేడాది ఏర్పాటు చేసిన అల్లూరి, అనుచరుల విగ్రహాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు