logo

ఖనిజ సంపద కొల్లగొట్టే యత్నం

గిరిజనుల పక్షాన నిలిచే వారికే ఓటు వేసి గెలిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరు, చింతపల్లిలో ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి అప్పలనర్స, సతక బుల్లిబాబులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 02:37 IST

పాడేరు, చింతపల్లి, న్యూస్‌టుడే: గిరిజనుల పక్షాన నిలిచే వారికే ఓటు వేసి గెలిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరు, చింతపల్లిలో ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి అప్పలనర్స, సతక బుల్లిబాబులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాడేరు పాత బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీలో ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు కర్మాగారం, రైల్వేజోన్‌ వంటి విషయాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సిద్ధమైందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం, నాయకులు కిల్లో సురేంద్ర, చిన్నయ్యపడాల్‌, సుందరరావు, పాలికి లక్కు, నర్సింగరావు, ధనుంజై, చిరంజీవి, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని