logo

పట్టపగలే దొంగతనం

గన్నవరం రామ్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అవ్వారు నరేష్‌బాబు అనే ప్రైవేట్‌ ఉద్యోగి స్థానికంగా నివసిస్తున్నారు.

Published : 20 Mar 2023 06:11 IST

చోరీకి పాల్పడిన ఇనుప బీరువా

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం రామ్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అవ్వారు నరేష్‌బాబు అనే ప్రైవేట్‌ ఉద్యోగి స్థానికంగా నివసిస్తున్నారు. పుట్టింటిలో ఉన్న భార్యను తీసుకు రావడానికి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయలు దేరి తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. లోపలకు వెళ్లి చూడగా సామాన్లు చెల్లాచెదురుగా పడి వెనుక తలుపు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఐదు కాసుల బంగారం, సుమారు అర కేజీ వెండి, కొంత నగదు చోరీకి గురైంది. ఇల్ల్లంతా గుడ్లు పగులగొట్టడంతో గంజాయి బ్యాచ్‌ మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు నరేష్‌ ఇంటి సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడాన్ని పక్కింటి వాళ్లు గమనించి ప్రశ్నించగా.. పిల్లులు పట్టుకొనేందుకు వచ్చినట్లు అతడు చెప్పడం గమనార్హం. క్లూస్‌ టీంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా నరేష్‌ ఇంటి సమీపంలో నివాసముంటున్న ఓ ఒంటరి మహిళ గృహంలోనూ అదే సమయంలో రూ.3 వేలు చోరీకి గురయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని