logo

రూ.7.06 కోట్ల నగదు.. మద్యం సీజ్‌

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల విభాగంలోని సీజర్‌ మేనేజ్‌మెంటు చురుగ్గా పని చేస్తోందని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 05:19 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల విభాగంలోని సీజర్‌ మేనేజ్‌మెంటు చురుగ్గా పని చేస్తోందని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.7.06 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్‌ చేసినట్టు వెల్లడించారు. పట్టుబడిన వాటిలో రూ.3.16 కోట్ల నగదు, రూ.94.16 లక్షల విలువైన 19,583 లీటర్ల మద్యం, రూ.12.20 లక్షల విలువైన 1,84,201 గ్రాముల మత్తు పదార్థాలు, రూ.2.32 కోట్ల విలువైన 7,758 గ్రాముల లోహాలు, రూ.6.43 లక్షల విలువైన 132 ఉచితాలు ఉన్నట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని