logo

వైకాపా గెలిస్తే భూములకు భద్రత ఉండదు: కొల్లు

భూహక్కు చట్టం కారణంగా రైతులు రోజూ ఆన్‌లైన్‌లో భూముల గురించి తనిఖీ చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతుందని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 16 Apr 2024 05:34 IST

చిన్నారులను ముద్దు చేస్తున్న రవీంద్ర

పొట్లపాలెం(మచిలీపట్నంరూరల్‌), న్యూస్‌టుడే: భూహక్కు చట్టం కారణంగా రైతులు రోజూ ఆన్‌లైన్‌లో భూముల గురించి తనిఖీ చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతుందని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పొట్లపాలెం పంచాయతీలో కొల్లు రవీంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ భూహక్కు చట్టం అత్యంత ప్రమాదకరమైనదని, వైకాపా గెలిస్తే రైతుల భూములకు భద్రత ఉండదని అన్నారు.  ప్రజాగళంలో భాగంగా ఈనెల 17న చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ మచిలీపట్నం వస్తున్నారని, తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు కుంచె నాని, తెదేపా క్లస్టర్‌ ఇన్‌ఛార్జి తలారి సోమశేఖర్‌, పొట్లపాలెం గ్రామ తెదేపా అధ్యక్షుడు పరసా పెంటయ్య, బుద్దాలపాలెం గ్రామ తెదేపా కార్యదర్శి కొక్కు రామాంజనేయులు, గోపు నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని