logo

వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల

వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Published : 18 Apr 2024 05:03 IST

ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రం

చౌటపల్లి(వీరులపాడు), న్యూస్‌టుడే : వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం చౌటపల్లిలో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రం గతంలో ఎస్సీ కాలనీ సమీపంలోని అద్దె భవనంలో కొనసాగించారు. ఇటీవల కేంద్రానికి సొంత భవనం నిర్మించారు. ఈ మధ్య వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు. ఇటీవల భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని కోరగా... ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు కేంద్రాన్ని స్థానిక వైకాపా నాయకుడి ఇంట్లోకి తరలించారు. ఆ నాయకుడి ఇల్లు ఎస్సీ కాలనీకి దూరంగా ఉంది. పైగా అతను వైద్యం కోసం వచ్చే వారి వద్ద వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడి ఇంట్లో కేంద్రం నిర్వహణపై అధికారులను ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా, నూతన భవనం పనులు పూర్తి కానందున ఇంకా తమకు అప్పగించలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని