logo

అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి  పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 19 Apr 2024 05:22 IST

న్యూస్‌టుడే బృందం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి  పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్య కూడళ్లలో సుజనా మాట్లాడుతూ పశ్చిమ ప్రజలు కులమతాలకు అతీతంగా మంచి అభ్యర్థులను ఆదరిస్తారన్నారు. గత ప్రజాప్రతినిధులు డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి వసతులు కల్పించలేదన్నారు. అన్ని వర్గాలు తనపై చూపుతున్న అభిమానాన్ని జీవితాంతం మరచిపోలేనన్నారు.

తరలివచ్చిన నేతలు: తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని), మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, జలీల్‌ఖాన్‌ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కూటమి నాయకులు అడ్డూరి శ్రీరామ్‌, ఎంఎస్‌ బేగ్‌, అబ్దుల్‌ ఖాదర్‌, నాగభూషణం, బాడిత శంకర్‌ పాల్గొన్నారు.

సమరోత్సాహం:  సుజనా.. తొలుత చిట్టినగర్‌ సెంటరులోని నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజలు చేశారు. తర్వాత తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ఊరేగింపుగా బ్రాహ్మణ వీధి మీదుగా రథం సెంటర్‌కు చేరుకున్నారు. రెండు కిలోమీటర్ల దూరానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, పార్టీ జెండాలతోపాటు అభ్యర్థి గుర్తు కమలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథం సెంటర్‌లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో క్రేన్‌ సహాయంతో భారీ గజమాలను సుజనా చౌదరి మెడలో వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు