logo

పీఏసీఎన్‌ కంప్యూటరీకరణపై శిక్షణ

ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్‌లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

Published : 25 Apr 2024 05:20 IST

చల్లపల్లి, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్‌లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి కె.చంద్రశేఖర్‌రెడ్డి  పాల్గొని ఏడు మండలాల కేడీసీసీ బ్యాంకు సూపర్‌ వైజర్లకు, పీఏసీఎన్‌లో సీఈవోలకు, సిబ్బందికి కంప్యూటరీకరణ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.  డివిజనల్‌ సహకార అధికారి వి.వి.ఫణికుమార్‌, సూపర్‌ వైజర్లు, సీఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీల కంప్యూటరీకరణ ద్వారా సభ్యుల పేర్లు నమోదు, రుణ లావాదేవీల నమోదు, డీసీసీబీలకు, ఆప్కాబ్‌ బ్యాంకుకి సొసైటీలను అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రైతులకు మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు అందించనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని