icon icon icon
icon icon icon

Pawan Kalyan: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్‌

జగన్‌ది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు.

Updated : 04 May 2024 16:45 IST

గుడివాడ: జగన్‌ది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు కాజేయాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలన్నారు. 

‘‘ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారు. అప్పటికే యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరమేంటి?అదేనా ఆయనకు మీరిచ్చే గౌరవం?తెలుగు ప్రజలకు ఉనికిని తెచ్చిన గొప్ప వ్యక్తి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని తగ్గించడం లేదు. కానీ.. ఆయన కంటే ముందు చాలా మంది మహానుభావులు వచ్చారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వైకాపా నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జనసేన సభ కోసం స్థలమిచ్చిన రైతుల ఇళ్లు కూల్చారు. 30 కేసులు నమోదైన జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైంది. గుడివాడలో నోరు పారేసుకునే ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముని గెలిపించాలి. అధికార పీఠం మనదే.. వైకాపా అవినీతి కోటను బద్దలు కొడదాం’’ అని పవన్‌ పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img