icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు పూరిళ్లా?: చంద్రబాబు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Published : 04 May 2024 17:50 IST

నూజివీడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్‌ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

‘‘నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చాలా రోజులుగా పోరాడుతున్నారు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా. జగన్‌కు ప్యాలెస్‌లు, ప్రజలకు మాత్రం పూరిళ్లా? ఇదెక్కడి న్యాయం. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కున్నారు. మొదటి సంతకం మెగాడీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు రద్దుపైనే. మన భూములపై జగన్‌ అజమాయిషీ ఏంటి? ప్రజల పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకు? భూమి మీది.. పెత్తనం జలగది. సైకో జగన్‌ అందరి మెడలకు ఉరితాడు వేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img