logo

నేటి నుంచి హోమ్‌ ఓటింగ్‌

పోలింగ్‌ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్‌ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్‌) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 07 May 2024 05:24 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌: పోలింగ్‌ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్‌ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్‌) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మొత్తం 1052 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. హోమ్‌ ఓటింగులో సెక్టోరల్‌ అధికారి, సూక్ష్మ పరిశీలకులు, పోలింగ్‌ బూత్‌ అధికారి, ఆర్మ్‌డ్‌ సిబ్బంది, వీడియో గ్రాఫర్‌ ఉంటారని తెలిపారు. ఓటింగ్‌ ప్లాట్‌ ఫాం ఏర్పాటు చేస్తామని, ఓటింగ్‌ విధానం పూర్తిగా రహస్యంగా ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు