Weather Forecast: మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాలకు భారీ వర్షసూచన!

దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని..

Published : 30 Nov 2021 13:06 IST

అమరావతి: దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. మరో 48 గంటల్లో మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతానికి దగ్గరగా వస్తుందని వెల్లడించింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. డిసెంబర్‌ 3వరకు కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది. ప్రస్తుతమున్న అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలకు సన్నద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని