logo
Published : 04/12/2021 02:44 IST

దేశ స్వయం సమృద్ధికి యువత కీలకం

తుళ్ళూరు, న్యూస్‌టుడే: దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించడంలో యువత పాత్ర కీలకమని, వారు సాంకేతికంగా మరింత ఎదగడానికి కృషి చేయాలని నావెల్‌ సిస్టమ్స్‌, మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌, డీఆర్డీవో శాస్త్రవేత్త డా.సమీర్‌ వి కామత్‌ అన్నారు. ఐనవోలులోని వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయంలో శుక్రవారం వర్చువల్‌ విధానంలో 66వ ‘కాంగ్రెస్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ థియరిటికల్‌ అండ్‌ అప్లైడ్‌ మెకానిక్స్‌ (ఐఎస్‌టీఎం)’ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా.సమీర్‌ వి కామత్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతికతను అందిస్తున్న వీఐటీ కృషి అభినందనీయమన్నారు. వీఐటీ ఛాన్సలర్‌ డా.జి.విశ్వనాథన్‌ ప్రసంగిస్తూ దేశాభివృద్ధిలో పరిశోధనల పాత్ర చాలా ముఖ్యమన్నారు. ఇష్టం (ఐఎస్‌టీఎం) ప్రెసిడెంట్‌ డా.జి.రాధాకృష్ణమాచార్య రాబోయే అయిదేళ్లలో ఇష్టం ప్రణాళిక గురించి వివరించారు. మూడు రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో అకాడమీ అధ్యాపకులు, శాస్త్రవేత్తల మధ్యనున్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో అనేక సమాంతర కార్యక్రమాలు నిర్వహించున్నట్లు వెల్లడించారు. ఇష్టం కార్యదర్శి డా.దీపక్‌ కుమార్‌ మైతి, డా.పి.ఎస్‌ రామాశ్రీకాంత్‌, కోకన్వీనరు డా.శంతను మండల్‌, వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ఎస్వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ సీఎల్‌వీ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని