logo

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందడుగు

అంబేడ్కర్‌ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ముందడుగు వేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె.సునీత అన్నారు. గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడులోని

Published : 07 Dec 2021 04:42 IST

చిత్ర ప్రదర్శన ప్రారంభిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సునీత

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ముందడుగు వేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె.సునీత అన్నారు. గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో వర్చువల్‌ విధానంలో గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె.హర్షవర్ధన్‌, ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఆకునూరి మురళి మాట్లాడారు. ఆయా జిల్లాల్లోని గురుకులాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అంబేడ్కర్‌ గురించి మాట్లాడారు. అనంతరం దళిత బహుజన రిసోర్సు కేంద్రం డైరెక్టరు దేవకుమార్‌ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనని సునీత ప్రారంభించి సందర్శించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జి.వెంకటరావు, గురుకులం ప్రిన్సిపల్‌ సి.శాంతి విశాల, ఉప ప్రిన్సిపల్‌ బి.సాల్మన్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు పి.శాంతి సుగుణశ్రీ, డాక్టర్‌ చుక్కా నాగభూషణం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని