logo

అర్జీల కదలికలు తెలుసుకోవచ్చు

ఒక రైలు లేదా బస్సు వెళుతున్న మార్గాన్ని ట్రాక్‌ ద్వారా ఎలా చూడగలుగుతున్నామో.. ప్రజలు సమర్పించిన అర్జీలు/వినతులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయాల సేవలు పొందేందుకు ఏపీ సేవ 2.0 (టు పాయింట్‌ ఓ)

Published : 28 Jan 2022 02:08 IST

సచివాలయాల్లో 2. పోర్టల్‌ సేవలు

వీసీలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్‌, మల్లాది, కలెక్టర్‌ నివాస్‌,

వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు తాతినేని పద్మావతి, అడపా శేషు, శివరామకృష్ణ, శ్రీకాంత్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఒక రైలు లేదా బస్సు వెళుతున్న మార్గాన్ని ట్రాక్‌ ద్వారా ఎలా చూడగలుగుతున్నామో.. ప్రజలు సమర్పించిన అర్జీలు/వినతులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయాల సేవలు పొందేందుకు ఏపీ సేవ 2.0 (టు పాయింట్‌ ఓ) పోర్టల్‌ సేవలు వినియోగించుకోవచ్చు. సదరు పోర్టల్‌ సేవలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లి నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. విజయవాడలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే సచివాలయాల సిబ్బంది మంచి పని తీరు కనబర్చాలన్నారు. సచివాలయాల ఉద్యోగులను జులై ఒకటి నుంచి క్రమబద్ధీకరించనున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 845 గ్రామ సచివాలయాలు, 440 వార్డు సచివాలయాలు ఉండగా, వీటిల్లో 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు తెలిపారు. ఏపీ సేవ పోర్టల్‌ ద్వారా ప్రజలు దాఖలు చేసిన అర్జీ ఎక్కడ ఉంది, అందాల్సిన సేవ ఎక్కడ ఆగింది, అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చన్నారు. పామర్రు, విజయవాడ మధ్య నగర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్‌, మల్లాది విష్ణు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు తాతినేని పద్మావతి, అడపా శేషు, ఎం.శివరామకృష్ణయ్య, తోలేటి శ్రీకాంత్‌, జమల పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని