logo
Published : 02/12/2021 06:13 IST

అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై కసరత్తు

మొత్తం ఖాళీలు 340

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో(ఐసీడీఎస్‌) ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక దస్త్రం తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. జేసీ డాక్టర్‌ సిరి ద్వారా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆమోదం కోసం దస్త్రం వెళ్లినట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 340 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. వీటిలో 39 కార్యకర్తలు, ఎనిమిది మినీ కార్యకర్తలు, తక్కిన 293 సహాయకుల (ఆయా) పోస్టుల ప్రకారం ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆ 340 పోస్టులకు సంబందించిన రిజర్వేషన్‌ రోస్టర్‌ జాబితాలను సీడీపీఓల నుంచి తీసుకున్నారు.

ఆరంభం నుంచీ వేతనమేదీ?

గతేడాది డిసెంబరులో జిల్లావ్యాప్తంగా 17 ప్రాజెక్టుల పరిధిలో 825 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేశారు. నియామక ఉత్తర్వులు తీసుకున్న అభ్యర్థినులు ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో సీడీపీఓ, జూనియర్‌, సీనియర్‌ సహాయకుల నిర్వాకం, నిర్లక్ష్యం మూలంగా 400 మంది వరకు కొత్త వారికి వేతనాలు చెల్లించలేదు. ఈ తతంగంపై ‘ఈనాడు’ అనేక కథనాలు ప్రచురించింది.

త్వరలో భర్తీ ప్రకటన

- సుజన, పీడీ, ఐసీడీఎస్‌

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి త్వరలో ప్రత్యేక ప్రకటన జారీ చేస్తాం. ఇందుకు సంబంధించిన దస్త్రం ఆమోదం కోసం పంపించాం. ప్రాజెక్టులవారీగా రిజర్వేషన్‌ రోస్టర్‌ను పక్కాగా పరిశీలించాం. ఎలాంటి తప్పులు లేవు. గతేడాది కొత్తగా విధుల్లో చేరిన వారిలో కొందరికి మాత్రమే వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేశాం.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని