logo

రూ.22కు కూరగాయలు వస్తాయా?

‘ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఆకుకూరలు, కూరగాయల కోసం రోజూ రూ.22 మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు ఆకుకూర కట్టే రూ.10. అన్ని రకాలు కొనాలంటే సాధ్యమేనా? మెనూ ప్రకారం భోజనం ఉండాలని చెబుతున్నారు. సత్వరమే ధరలు

Published : 05 Dec 2021 04:48 IST

మాట్లాడుతున్న పీడీ సుజన, పక్కన ఏపీడీ లక్ష్మీకుమారి

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ‘ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఆకుకూరలు, కూరగాయల కోసం రోజూ రూ.22 మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు ఆకుకూర కట్టే రూ.10. అన్ని రకాలు కొనాలంటే సాధ్యమేనా? మెనూ ప్రకారం భోజనం ఉండాలని చెబుతున్నారు. సత్వరమే ధరలు పెంచాల్సిందే’.. అని అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్‌ పీడీ సుజనతో మొర పెట్టుకున్నారు. శనివారం తెలుగు మహిళా ప్రాంగణ ఆవరణలో ‘జిల్లా స్థాయి అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ’ సమావేశం జరిగింది. తొలుత పీడీ సుజన 17 ప్రాజెక్టుల పరిధిలో ఏయే సమస్యలు ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు. అనంతరం అన్ని ప్రాజెక్టుల తరఫున అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం నాయకురాళ్లు సమస్యలను ఏకరవు పెట్టారు. నిత్యావసర సరకులు, కూరగాయలు, గ్యాస్‌కు ఇస్తున్న బిల్లు సరిపోవడం లేదు. వీటన్నింటికీ ఒక్కో పిల్లాడికి రూ.1.8 మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు పీడీ లక్ష్మీకుమారి, సీఐటీయూ నాయకులు ఓబులు, నాగమణి, దిల్‌షాద్‌, అంగన్‌వాడీల సంఘం నాయకులు శ్రీదేవి, శకుంతల, జమున, నక్షత్ర, సీడీపీఓలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని