logo

బాలకృష్ణకు ఘన స్వాగతం

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు.

Updated : 27 Apr 2024 05:28 IST

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా పర్యటనకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఆయన హిందూపురం నుంచి ఇక్కడి వచ్చారు. కియా ఇండియా కార్లతయారీ పరిశ్రమసమీపంలో హెలికాప్టర్‌ దిగింది. తమ అభిమాన నటుడు బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకొన్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని జైబాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఆయనతో ఫొటోలు దిగారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆయన కందుకూరుకు బయలుదేరివెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని