logo

28న ఏపీసెట్‌

సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్‌-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు.

Published : 27 Apr 2024 03:34 IST

ఎస్కేయూ న్యూస్‌టుడే: సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్‌-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. అనంతపురం జిల్లాలో 6 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎస్కేయూ, జేఎన్‌టీయూ, అనంతలక్ష్మి, ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాల, కేఎస్‌ఎన్‌ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 3,048 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించమన్నారు. అభ్యర్థులు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు