logo

పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!

ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్‌ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది.

Published : 27 Apr 2024 03:59 IST

న్యూస్‌టుడే, అనంత నగరపాలక: ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్‌ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. ఆరు నెలల కిందట కంకర వేసి వదిలేశారు. వైకాపాకు చెందిన నాయకులు ప్రశ్నించడంతో ఆగమేఘాల మీద రోడ్డును పూర్తి చేశారు. ఇదే దారిలో పార్వతమ్మ కాలనీకి వెళ్లే మార్గం ఉంది. కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించగా అక్కడ నివసిస్తున్న మహిళ కుళాయి, రోడ్డు సౌకర్యం కల్పించకుండా ఏ ముఖం పెట్టుకొని మా కాలనీకి వచ్చావని ప్రశ్నిస్తే దాడి చేసి కేసులు సైతం నమోదు చేశారు. పెద్దలు వెళ్లే ప్రాంతానికి తారురోడ్డు వేయగా పేదలు వెళ్లే కాలనీకి కనీసం మట్టి రోడ్డు కూడా వేయకుండా వదిలేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని