logo

ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్‌ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ జి.మోహన్‌ మురళి తెలిపారు.

Published : 27 Apr 2024 03:34 IST

మే 4 నుంచి 10 వరకు అవకాశం

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్‌ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ జి.మోహన్‌ మురళి తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ ఆర్డీటీ  భరిస్తుందని,. మే 4 నుంచి 10లోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వివరించారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 19న నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 08554-271353, 271354 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని