logo

చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప

తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 03:51 IST

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే : తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని పద్మావతి ఫంక్షన్‌ హాలులో చేనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిమ్మల కిష్టప్ప, అనంతపురం పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్‌ తెదేపా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం చేనేత రంగాన్ని కుదేలు చేసిందన్నారు. తెదేపా హయాంలో చేనేతలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, జగన్‌ అధికారంలోకి రాగానే రాయితీలు, సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసి మోసం చేశారన్నారు. చేనేత వృత్తి వదిలేసి, ఇతర పనులకు కూలీలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే చేనేతల సమస్యలన్నీ పరిష్కరించడమే కాకుండా పథకాలు, రాయితీలను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత ఉత్పత్తులను విక్రయశాలలు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం దగ్గుపాటి ప్రసాద్‌, నిమ్మలకిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణను చేనేత ఐక్యవేదిక నాయకులు ఘనంగా సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని